Sri Gayatri Sahasranama Stotram in Telugu

శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రం

శ్రీ గాయత్రి సహస్రనామ స్తోత్రం అనేది అమ్మవారి వెయ్యి నామాలను స్మరించుకునే మహత్తరమైన స్తోత్రం. గాయత్రి దేవి జ్ఞానం, శుద్ధి, ప్రకాశానికి ప్రతీక. ఈ స్తోత్రాన్ని పఠించేటప్పుడు మన ఆలోచనలు నెమ్మదిగా శాంతిస్తాయి, మనసు స్వచ్ఛంగా మారుతుంది. చదువు, ఆధ్యాత్మిక అభివృద్ధి, మానసిక బలం కోరుకునే వారికి ఈ స్తోత్రం ఎంతో ఉపకరిస్తుంది.

Sri Gayatri Sahasranama Stotram in Telugu
Sri Gayatri Sahasranama Stotram

గణేశాయ నమః |

ధ్యానం -
రక్తశ్వేతహిరణ్యనీలధవలైర్యుక్తాం త్రినేత్రోజ్జ్వలాం
రక్తారక్తనవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం |
గాయత్రీ కమలాసనాం కరతలవ్యానద్ధకుండాంబుజాం
పద్మాక్షీం చ వరస్రజంచ దధతీం హంసాధిరూఢాం భజే ||

ఓం తత్కారరూపా తత్త్వజ్ఞా తత్పదార్థస్వరూపిణి |
తపస్స్వ్యాధ్యాయనిరతా తపస్విజననన్నుతా ||1||

తత్కీర్తిగుణసంపన్నా తథ్యవాక్చ తపోనిధిః |
తత్త్వోపదేశసంబంధా తపోలోకనివాసినీ ||2||

తరుణాదిత్యసంకాశా తప్తకాంచనభూషణా |
తమోపహారిణి తంత్రీ తారిణి తారరూపిణి ||3||

తలాదిభువనాంతస్థా తర్కశాస్త్రవిధాయినీ |
తంత్రసారా తంత్రమాతా తంత్రమార్గప్రదర్శినీ ||4||

తత్త్వా తంత్రవిధానజ్ఞా తంత్రస్థా తంత్రసాక్షిణి |
తదేకధ్యాననిరతా తత్త్వజ్ఞానప్రబోధినీ ||5||

తన్నామమంత్రసుప్రీతా తపస్విజనసేవితా |
సాకారరూపా సావిత్రీ సర్వరూపా సనాతనీ ||6||

సంసారదుఃఖశమనీ సర్వయాగఫలప్రదా |
సకలా సత్యసంకల్పా సత్యా సత్యప్రదాయినీ ||7||

సంతోషజననీ సారా సత్యలోకనివాసినీ |
సముద్రతనయారాధ్యా సామగానప్రియా సతీ ||8||

సమానీ సామదేవీ చ సమస్తసురసేవితా |
సర్వసంపత్తిజననీ సద్గుణా సకలేష్టదా ||9||

సనకాదిమునిధ్యేయా సమానాధికవర్జితా |
సాధ్యా సిద్ధా సుధావాసా సిద్ధిస్సాధ్యప్రదాయినీ ||10||

సద్యుగారాధ్యనిలయా సముత్తీర్ణా సదాశివా |
సర్వవేదాంతనిలయా సర్వశాస్త్రార్థగోచరా ||11||

సహస్రదలపద్మస్థా సర్వజ్ఞా సర్వతోముఖీ |
సమయా సమయాచారా సదసద్గ్రంథిభేదినీ ||12||

సప్తకోటిమహామంత్రమాతా సర్వప్రదాయినీ |
సగుణా సంభ్రమా సాక్షీ సర్వచైతన్యరూపిణీ ||13||

సత్కీర్తిస్సాత్వికా సాధ్వీ సచ్చిదానందరూపిణీ |
సంకల్పరూపిణీ సంధ్యా సాలగ్రామనివాసినీ ||14||

సర్వోపాధివినిర్ముక్తా సత్యజ్ఞానప్రబోధినీ |
వికారరూపా విప్రశ్రీర్విప్రారాధనతత్పరా ||15||

విప్రప్రీర్విప్రకల్యాణీ విప్రవాక్యస్వరూపిణీ |
విప్రమందిరమధ్యస్థా విప్రవాదవినోదినీ ||16||

విప్రోపాధివినిర్భేత్రీ విప్రహత్యావిమోచనీ |
విప్రత్రాతా విప్రగోత్రా విప్రగోత్రవివర్ధినీ ||17||

విప్రభోజనసంతుష్టా విష్ణురూపా వినోదినీ |
విష్ణుమాయా విష్ణువంద్యా విష్ణుగర్భా విచిత్రిణీ ||18||

వైష్ణవీ విష్ణుభగినీ విష్ణుమాయావిలాసినీ |
వికారరహితా విశ్వవిజ్ఞానఘనరూపిణీ ||19||

విబుధా విష్ణుసంకల్పా విశ్వామిత్రప్రసాదినీ |
విష్ణుచైతన్యనిలయా విష్ణుస్వా విశ్వసాక్షిణీ ||20||

వివేకినీ వియద్రూపా విజయా విశ్వమోహినీ |
విద్యాధరీ విధానజ్ఞా వేదతత్త్వార్థరూపిణీ ||21||

విరూపాక్షీ విరాడ్రూపా విక్రమా విశ్వమంగలా |
విశ్వంభరాసమారాధ్యా విశ్వభ్రమణకారిణీ ||22||

వినాయకీ వినోదస్థా వీరగోష్ఠీవివర్ధినీ |
వివాహరహితా వింధ్యా వింధ్యాచలనివాసినీ ||23||

విద్యావిద్యాకరీ విద్యా విద్యావిద్యాప్రబోధినీ |
విమలా విభవా వేద్యా విశ్వస్థా వివిధోజ్జ్వలా ||24||

వీరమధ్యా వరారోహా వితంత్రా విశ్వనాయికా |
వీరహత్యాప్రశమనీ వినమ్రజనపాలినీ ||25||

వీరధీర్వివిధాకారా విరోధిజననాశినీ |
తుకారరూపా తుర్యశ్రీస్తులసీవనవాసినీ ||26||

తురంగీ తురగారూఢా తులాదానఫలప్రదా |
తులామాఘస్నానతుష్టా తుష్టిపుష్టిప్రదాయినీ ||27||

తురంగమప్రసంతుష్టా తులితా తుల్యమధ్యగా |
తుంగోత్తుంగా తుంగకుచా తుహినాచలసంస్థితా ||28||

తుంబురాదిస్తుతిప్రీతా తుషారశిఖరీశ్వరీ |
తుష్టా చ తుష్టిజననీ తుష్టలోకనివాసినీ ||29||

తులాధారా తులామధ్యా తులస్థా తుర్యరూపిణీ |
తురీయగుణగంభీరా తుర్యనాదస్వరూపిణీ ||30||

తుర్యవిద్యాలాస్యతుష్టా తూర్యశాస్త్రార్థవాదినీ |
తురీయశాస్త్రతత్త్వజ్ఞా తూర్యనాదవినోదినీ ||31||

తూర్యనాదాంతనిలయా తూర్యానందస్వరూపిణీ |
తురీయభక్తిజననీ తుర్యమార్గప్రదర్శినీ ||32||

వకారరూపా వాగీశీ వరేణ్యా వరసంవిధా |
వరా వరిష్ఠా వైదేహీ వేదశాస్త్రప్రదర్శినీ ||33||

వికల్పశమనీ వాణీ వాంఛితార్థఫలప్రదా |
వయస్థా చ వయోమధ్యా వయోవస్థావివర్జితా ||34||

వందినీ వాదినీ వర్యా వాఙ్మయీ వీరవందితా |
వానప్రస్థాశ్రమస్థా చ వనదుర్గా వనాలయా ||35||

వనజాక్షీ వనచరీ వనితా విశ్వమోహినీ |
వసిష్ఠావామదేవాదివంద్యా వంద్యస్వరూపిణీ ||36||

వైద్యా వైద్యచికిత్సా చ వషట్కారీ వసుంధరా |
వసుమాతా వసుత్రాతా వసుజన్మవిమోచనీ ||37||

వసుప్రదా వాసుదేవీ వాసుదేవ మనోహరీ |
వాసవార్చితపాదశ్రీర్వాసవారివినాశినీ ||38||

వాగీశీ వాఙ్మనస్థాయీ వశినీ వనవాసభూః |
వామదేవీ వరారోహా వాద్యఘోషణతత్పరా ||39||

వాచస్పతిసమారాధ్యా వేదమాతా వినోదినీ |
రేకారరూపా రేవా చ రేవాతీరనివాసినీ ||40||

రాజీవలోచనా రామా రాగిణిరతివందితా |
రమణీరామజప్తా చ రాజ్యపా రాజతాద్రిగా ||41||

రాకిణీ రేవతీ రక్షా రుద్రజన్మా రజస్వలా |
రేణుకారమణీ రమ్యా రతివృద్ధా రతా రతిః ||42||

రావణానందసంధాయీ రాజశ్రీ రాజశేఖరీ |
రణమద్యా రథారూఢా రవికోటిసమప్రభా ||43||

రవిమండలమధ్యస్థా రజనీ రవిలోచనా |
రథాంగపాణి రక్షోఘ్నీ రాగిణీ రావణార్చితా ||44||

రంభాదికన్యకారాధ్యా రాజ్యదా రాజ్యవర్ధినీ |
రజతాద్రీశసక్థిస్థా రమ్యా రాజీవలోచనా ||45||

రమ్యవాణీ రమారాధ్యా రాజ్యధాత్రీ రతోత్సవా |
రేవతీ చ రతోత్సాహా రాజహృద్రోగహారిణీ ||46||

రంగప్రవృద్ధమధురా రంగమండపమధ్యగా |
రంజితా రాజజననీ రమ్యా రాకేందుమధ్యగా ||47||

రావిణీ రాగిణీ రంజ్యా రాజరాజేశ్వరార్చితా |
రాజన్వతీ రాజనీతీ రజతాచలవాసినీ ||48||

రాఘవార్చితపాదశ్రీ రాఘవా రాఘవప్రియా |
రత్ననూపురమధ్యాఢ్యా రత్నద్వీపనివాసినీ ||49||

రత్నప్రాకారమధ్యస్థా రత్నమండపమధ్యగా |
రత్నాభిషేకసంతుష్టా రత్నాంగీ రత్నదాయినీ ||50||

ణికారరూపిణీ నిత్యా నిత్యతృప్తా నిరంజనా |
నిద్రాత్యయవిశేషజ్ఞా నీలజీమూతసన్నిభా ||51||

నీవారశూకవత్తన్వీ నిత్యకల్యాణరూపిణీ |
నిత్యోత్సవా నిత్యపూజ్యా నిత్యానందస్వరూపిణీ ||52||

నిర్వికల్పా నిర్గుణస్థా నిశ్చింతా నిరుపద్రవా |
నిస్సంశయా నిరీహా చ నిర్లోభా నీలమూర్ధజా ||53||

నిఖిలాగమమధ్యస్థా నిఖిలాగమసంస్థితా |
నిత్యోపాధివినిర్ముక్తా నిత్యకర్మఫలప్రదా ||54||

నీలగ్రీవా నిరాహారా నిరంజనవరప్రదా |
నవనీతప్రియా నారీ నరకార్ణవతారిణీ ||55||

నారాయణీ నిరీహా చ నిర్మలా నిర్గుణప్రియా |
నిశ్చింతా నిగమాచారనిఖిలాగమ చ వేదినీ ||56||

నిమేషానిమిషోత్పన్నా నిమేషాండవిధాయినీ |
నివాతదీపమధ్యస్థా నిర్విఘ్నా నీచనాశినీ ||57||

నీలవేణీ నీలఖండా నిర్విషా నిష్కశోభితా |
నీలాంశుకపరీధానా నిందఘ్నీ చ నిరీశ్వరీ ||58||

నిశ్వాసోచ్ఛ్వాసమధ్యస్థా నిత్యయానవిలాసినీ |
యంకారరూపా యంత్రేశీ యంత్రీ యంత్రయశస్వినీ ||59||

యంత్రారాధనసంతుష్టా యజమానస్వరూపిణీ |
యోగిపూజ్యా యకారస్థా యూపస్తంభనివాసినీ ||60||

యమఘ్నీ యమకల్పా చ యశఃకామా యతీశ్వరీ |
యమాదీయోగనిరతా యతిదుఃఖాపహారిణీ ||61||

యజ్ఞా యజ్వా యజుర్గేయా యజ్ఞేశ్వరపతివ్రతా |
యజ్ఞసూత్రప్రదా యష్ట్రీ యజ్ఞకర్మఫలప్రదా ||62||

యవాంకురప్రియా యంత్రీ యవదఘ్నీ యవార్చితా |
యజ్ఞకర్తీ యజ్ఞభోక్త్రీ యజ్ఞాంగీ యజ్ఞవాహినీ ||63||

యజ్ఞసాక్షీ యజ్ఞముఖీ యజుషీ యజ్ఞరక్షిణీ |
భకారరూపా భద్రేశీ భద్రకల్యాణదాయినీ ||64||

భక్తప్రియా భక్తసఖా భక్తాభీష్టస్వరూపిణీ |
భగినీ భక్తసులభా భక్తిదా భక్తవత్సలా ||65||

భక్తచైతన్యనిలయా భక్తబంధవిమోచనీ |
భక్తస్వరూపిణీ భాగ్యా భక్తారోగ్యప్రదాయినీ ||66||

భక్తమాతా భక్తగమ్యా భక్తాభీష్టప్రదాయినీ |
భాస్కరీ భైరవీ భోగ్యా భవానీ భయనాశినీ ||67||

భద్రాత్మికా భద్రదాయీ భద్రకాలీ భయంకరీ |
భగనిష్యందినీ భూమ్నీ భవబంధవిమోచనీ ||68||

భీమా భవసఖా భంగీభంగురా భీమదర్శినీ |
భల్లీ భల్లీధరా భీరుర్భేరుండా భీమపాపహా ||69||

భావజ్ఞా భోగదాత్రీ చ భవఘ్నీ భూతిభూషణా |
భూతిదా భూమిదాత్రీ చ భూపతిత్వప్రదాయినీ ||70||

భ్రామరీ భ్రమరీ భారీ భవసాగరతారిణీ |
భండాసురవధోత్సాహా భాగ్యదా భావమోదినీ ||71||

గోకారరూపా గోమాతా గురుపత్నీ గురుప్రియా |
గోరోచనప్రియా గౌరీ గోవిందగుణవర్ధినీ ||72||

గోపాలచేష్టాసంతుష్టా గోవర్ధనవివర్ధినీ |
గోవిందరూపిణీ గోప్త్రీ గోకులానాంవివర్ధినీ ||73||

గీతా గీతప్రియా గేయా గోదా గోరూపధారిణీ |
గోపీ గోహత్యశమనీ గుణినీ గుణివిగ్రహా ||74||

గోవిందజననీ గోష్ఠా గోప్రదా గోకులోత్సవా |
గోచరీ గౌతమీ గంగా గోముఖీ గుణవాసినీ ||75||

గోపాలీ గోమయా గుంభా గోష్ఠీ గోపురవాసినీ |
గరుడా గమనశ్రేష్ఠా గారుడా గరుడధ్వజా ||76||

గంభీరా గండకీ గుండా గరుడధ్వజవల్లభా |
గగనస్థా గయావాసా గుణవృత్తిర్గుణోద్భవా ||77||

దేకారరూపా దేవేశీ దృగ్రూపా దేవతార్చితా |
దేవరాజేశ్వరార్ధాంగీ దీనదైన్యవిమోచనీ ||78||

దేకాలపరిజ్ఞానా దేశోపద్రవనాశినీ |
దేవమాతా దేవమోహా దేవదానవమోహినీ ||79||

దేవేంద్రార్చితపాదశ్రీ దేవదేవప్రసాదినీ |
దేశాంతరీ దేశరూపా దేవాలయనివాసినీ ||80||

దేశభ్రమణసంతుష్టా దేశస్వాస్థ్యప్రదాయినీ |
దేవయానా దేవతా చ దేవసైన్యప్రపాలినీ ||81||

వకారరూపా వాగ్దేవీ వేదమానసగోచరా |
వైకుంఠదేశికా వేద్యా వాయురూపా వరప్రదా ||82||

వక్రతుండార్చితపదా వక్రతుండప్రసాదినీ |
వైచిత్ర్యరూపా వసుధా వసుస్థానా వసుప్రియా ||83||

వషట్కారస్వరూపా చ వరారోహా వరాసనా |
వైదేహీ జననీ వేద్యా వైదేహీశోకనాశినీ ||84||

వేదమాతా వేదకన్యా వేదరూపా వినోదినీ |
వేదాంతవాదినీ చైవ వేదాంతనిలయప్రియా ||85||

వేదశ్రవా వేదఘోషా వేదగీతా వినోదినీ |
వేదశాస్త్రార్థతత్త్వజ్ఞా వేదమార్గ ప్రదర్శినీ ||86||

వైదికీకర్మఫలదా వేదసాగరవాడవా |
వేదవంద్యా వేదగుహ్యా వేదాశ్వరథవాహినీ ||87||

వేదచక్రా వేదవంద్యా వేదాంగీ వేదవిత్కవిః |
సకారరూపా సామంతా సామగాన విచక్షణా ||88||

సామ్రాజ్ఞీ నామరూపా చ సదానందప్రదాయినీ |
సర్వదృక్సన్నివిష్టా చ సర్వసంప్రేషిణీసహా ||89||

సవ్యాపసవ్యదా సవ్యసధ్రీచీ చ సహాయినీ |
సకలా సాగరా సారా సార్వభౌమస్వరూపిణీ ||90||

సంతోషజననీ సేవ్యా సర్వేశీ సర్వరంజనీ |
సరస్వతీ సమారాద్యా సామదా సింధుసేవితా ||91||

సమ్మోహినీ సదామోహా సర్వమాంగల్యదాయినీ |
సమస్తభువనేశానీ సర్వకామఫలప్రదా ||92||

సర్వసిద్ధిప్రదా సాధ్వీ సర్వజ్ఞానప్రదాయినీ |
సర్వదారిద్ర్యశమనీ సర్వదుఃఖవిమోచనీ ||93||

సర్వరోగప్రశమనీ సర్వపాపవిమోచనీ |
సమదృష్టిస్సమగుణా సర్వగోప్త్రీ సహాయినీ ||94||

సామర్థ్యవాహిని సాంఖ్యా సాంద్రానందపయోధరా |
సంకీర్ణమందిరస్థానా సాకేతకులపాలినీ ||95||

సంహారిణీ సుధారూపా సాకేతపురవాసినీ |
సంబోధినీ సమస్తేశీ సత్యజ్ఞానస్వరూపిణీ ||96||

సంపత్కరీ సమానాంగీ సర్వభావసుసంస్థితా |
సంధ్యావందనసుప్రీతా సన్మార్గకులపాలినీ ||97||

సంజీవినీ సర్వమేధా సభ్యా సాధుసుపూజితా |
సమిద్ధా సామిఘేనీ చ సామాన్యా సామవేదినీ ||98||

సముత్తీర్ణా సదాచారా సంహారా సర్వపావనీ |
సర్పిణీ సర్పమాతా చ సమాదానసుఖప్రదా ||99||

సర్వరోగప్రశమనీ సర్వజ్ఞత్వఫలప్రదా |
సంక్రమా సమదా సింధుః సర్గాదికరణక్షమా ||100||

సంకటా సంకటహరా సకుంకుమవిలేపనా |
సుముఖా సుముఖప్రీతా సమానాధికవర్జితా ||101||

సంస్తుతా స్తుతిసుప్రీతా సత్యవాదీ సదాస్పదా |
ధీకారరూపా ధీమాతా ధీరా ధీరప్రసాదినీ ||102||

ధీరోత్తమా ధీరధీరా ధీరస్థా ధీరశేఖరా |
ధృతిరూపా ధనాఢ్యా చ ధనపా ధనదాయినీ ||103||

ధీరూపా ధీరవంద్యా చ ధీప్రభా ధీరమానసా |
ధీగేయా ధీపదస్థా చ ధీశానా ధీప్రసాదినీ ||104||

మకారరూపా మైత్రేయా మహామంగలదేవతా |
మనోవైకల్యశమనీ మలయాచలవాసినీ ||105||

మలయధ్వజరాజశ్రీర్మాయామోహవిభేదినీ |
మహాదేవీ మహారూపా మహాభైరవపూజితా ||106||

మనుప్రీతా మంత్రమూర్తిర్మంత్రవశ్యా మహేశ్వరీ |
మత్తమాతంగగమనా మధురా మేరుమంటపా ||107||

మహాగుప్తా మహాభూతా మహాభయవినాశినీ |
మహాశౌర్యా మంత్రిణీ చ మహావైరివినాశినీ ||108||

మహాలక్ష్మీర్మహాగౌరీ మహిషాసురమర్దినీ |
మహీ చ మండలస్థా చ మధురాగమపూజితా ||109||

మేధా మేధాకరీ మేధ్యా మాధవీ మధుమర్ధినీ |
మంత్రా మంత్రమయీ మాన్యా మాయా మాధవమంత్రిణీ ||110||

మాయాదూరా చ మాయావీ మాయాజ్ఞా మానదాయినీ |
మాయాసంకల్పజననీ మాయామాయవినోదినీ ||111||

మాయా ప్రపంచశమనీ మాయాసంహారరూపిణీ |
మాయామంత్రప్రసాదా చ మాయాజనవిమోహినీ ||112||

మహాపథా మహాభోగా మహవిఘ్నవినాశినీ |
మహానుభావా మంత్రాఢ్యా మహమంగలదేవతా ||113||

హికారరూపా హృద్యా చ హితకార్యప్రవర్ధినీ |
హేయోపాధివినిర్ముక్తా హీనలోకవినాశినీ ||114||

హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హ్రీం దేవీ హ్రీం స్వభావినీ |
హ్రీం మందిరా హితకరా హృష్టా చ హ్రీం కులోద్భవా ||115||

హితప్రజ్ఞా హితప్రీతా హితకారుణ్యవర్ధినీ |
హితాసినీ హితక్రోధా హితకర్మఫలప్రదా ||116||

హిమా హైమవతీ హైమ్నీ హేమాచలనివాసినీ |
హిమాగజా హితకరీ హితకర్మస్వభావినీ ||117||

ధీకారరూపా ధిషణా ధర్మరూపా ధనేశ్వరీ |
ధనుర్ధరా ధరాధారా ధర్మకర్మఫలప్రదా ||118||

ధర్మాచారా ధర్మసారా ధర్మమధ్యనివాసినీ |
ధనుర్విద్యా ధనుర్వేదా ధన్యా ధూర్తవినాశినీ ||119||

ధనధాన్యా ధేనురూపా ధనాఢ్యా ధనదాయినీ |
ధనేశీ ధర్మనిరతా ధర్మరాజప్రసాదినీ ||120||

ధర్మస్వరూపా ధర్మేశీ ధర్మాధర్మవిచారిణీ |
ధర్మసూక్ష్మా ధర్మగేహా ధర్మిష్ఠా ధర్మగోచరా ||121||

యోకారరూపా యోగేశీ యోగస్థా యోగరూపిణీ |
యోగ్యా యోగీశవరదా యోగమార్గనివాసినీ ||122||

యోగాసనస్థా యోగేశీ యోగమాయావిలాసినీ |
యోగినీ యోగరక్తా చ యోగాంగీ యోగవిగ్రహా ||123||

యోగవాసా యోగభాగ్యా యోగమార్గప్రదర్శినీ |
యోకారరూపా యోధాఢ్యాయోధ్రీ యోధసుతత్పరా ||124||

యోగినీ యోగినీసేవ్యా యోగజ్ఞానప్రబోధినీ |
యోగేశ్వరప్రాణానాథా యోగీశ్వరహృదిస్థితా ||125||

యోగా యోగక్షేమకర్త్రీ యోగక్షేమవిధాయినీ |
యోగరాజేశ్వరారాధ్యా యోగానందస్వరూపిణీ ||126||

నకారరూపా నాదేశీ నామపారాయణప్రియా |
నవసిద్ధిసమారాధ్యా నారాయణమనోహరీ ||127||

నారాయణీ నవాధారా నవబ్రహ్మార్చితాంఘ్రికా |
నగేంద్రతనయారాధ్యా నామరూపవివర్జితా ||128||

నరసింహార్చితపదా నవబంధవిమోచనీ |
నవగ్రహార్చితపదా నవమీపూజనప్రియా ||129||

నైమిత్తికార్థఫలదా నందితారివినాశినీ |
నవపీఠస్థితా నాదా నవర్షిగణసేవితా ||130||

నవసూత్రావిధానజ్ఞా నైమిశారణ్యవాసినీ |
నవచందనదిగ్ధాంగీ నవకుంకుమధారిణీ ||131||

నవవస్త్రపరీధానా నవరత్నవిభూషణా |
నవ్యభస్మవిదగ్ధాంగీ నవచంద్రకలాధరా ||132||

ప్రకారరూపా ప్రాణేశీ ప్రాణసంరక్షణీపరా |
ప్రాణసంజీవినీ ప్రాచ్యా ప్రాణిప్రాణప్రబోధినీ ||133||

ప్రజ్ఞా ప్రాజ్ఞా ప్రభాపుష్పా ప్రతీచీ ప్రభుదా ప్రియా |
ప్రాచీనా ప్రాణిచిత్తస్థా ప్రభా ప్రజ్ఞానరూపిణీ ||134||

ప్రభాతకర్మసంతుష్టా ప్రాణాయామపరాయణా |
ప్రాయజ్ఞా ప్రణవా ప్రాణా ప్రవృత్తిః ప్రకృతిః పరా ||135||

ప్రబంధా ప్రథమా చైవ ప్రగా ప్రారబ్ధనాశినీ |
ప్రబోధనిరతా ప్రేక్ష్యా ప్రబంధా ప్రాణసాక్షిణీ ||136||

ప్రయాగతీర్థనిలయా ప్రత్యక్షపరమేశ్వరీ |
ప్రణవాద్యంతనిలయా ప్రణవాదిః ప్రజేశ్వరీ ||137||

చోకారరూపా చోరఘ్నీ చోరబాధావినాశినీ |
చైతన్యచేతనస్థా చ చతురా చ చమత్కృతిః ||138||

చక్రవర్తికులాధారా చక్రిణీ చక్రధారిణీ |
చిత్తచేయా చిదానందా చిద్రూపా చిద్విలాసినీ ||139||

చింతాచిత్తప్రశమనీ చింతితార్థఫలప్రదా |
చాంపేయీ చంపకప్రీతా చండీ చండాట్టహాసినీ ||140||

చండేశ్వరీ చండమాతా చండముండవినాశినీ |
చకోరాక్షీ చిరప్రీతా చికురా చికురాలకా ||141||

చైతన్యరూపిణీ చైత్రీ చేతనా చిత్తసాక్షిణీ |
చిత్రా చిత్రవిచిత్రాంగీ చిత్రగుప్తప్రసాదినీ ||142||

చలనా చక్రసంస్థా చ చాంపేయీ చలచిత్రిణీ |
చంద్రమండలమధ్యస్థా చంద్రకోటిసుశీతలా ||143||

చంద్రానుజసమారాధ్యా చంద్రా చండమహోదరీ |
చర్చితారిశ్చంద్రమాతా చంద్రకాంతా చలేశ్వరీ ||144||

చరాచరనివాసీ చ చక్రపాణిసహోదరీ |
దకారరూపా దత్తశ్రీదారిద్ర్యచ్ఛేదకారిణీ ||145||

దత్తాత్రేయస్య వరదా దర్యా చ దీనవత్సలా |
దక్షారాధ్యా దక్షకన్యా దక్షయజ్ఞవినాశినీ ||146||

దక్షా దాక్షాయణీ దీక్షా దృష్టా దక్షవరప్రదా |
దక్షిణా దక్షిణారాధ్యా దక్షిణామూర్తిరూపిణీ ||147||

దయావతీ దమస్వాంతా దనుజారిర్దయానిధిః |
దంతశోభనిభా దేవీ దమనా దాడిమస్తనా ||148||

దండా చ దమయత్రీ చ దండినీ దమనప్రియా |
దండకారణ్యనిలయా దండకారివినాశినీ ||149||

దంష్ట్రాకరాలవదనా దండశోభా దరోదరీ |
దరిద్రారిష్టశమనీ దమ్యా దమనపూజితా ||150||

దానవార్చిత పాదశ్రీర్ద్రవిణా ద్రావిణీ దయా |
దామోదరీ దానవారిర్దామోదరసహోదరీ ||151||

దాత్రీ దానప్రియా దామ్నీ దానశ్రీర్ద్విజవందితా |
దంతిగా దండినీ దూర్వా దధిదుగ్ధస్వరూపిణీ ||152||

దాడిమీబీజసందోహా దంతపంక్తివిరాజితా |
దర్పణా దర్పణస్వచ్ఛా ద్రుమమండలవాసినీ ||153||

దశావతారజననీ దశదిగ్దైవపూజితా |
దమా దశదిశా దృశ్యా దశదాసీ దయానిధిః ||154||

దేశకాలపరిజ్ఞానా దేశకాలవిశోధినీ |
దశమ్యాదికలారాధ్యా దశకాలవిరోధినీ |
దశమ్యాదికలారాధ్య దశగ్రీవవిరోధినీ ||155||

దశాపరాధశమనీ దశవృత్తిఫలప్రదా |
యాత్కారరూపిణీ యాజ్ఞీ యాదవీ యాదవార్చితా ||156||

యయాతిపూజనప్రీతా యాజ్ఞికీ యాజకప్రియా |
యజమానా యదుప్రీతా యామపూజాఫలప్రదా ||157||

యశస్వినీ యమారాధ్యా యమకన్యా యతీశ్వరీ |
యమాదియోగసంతుష్టా యోగీంద్రహృదయా యమా ||158||

యమోపాధివినిర్ముక్తా యశస్యవిధిసన్నుతా |
యవీయసీ యువప్రీతా యాత్రానందా యతీశ్వరీ ||159||

యోగప్రియా యోగగమ్యా యోగధ్యేయా యథేచ్ఛగా |
యోగప్రియా యజ్ఞసేనీ యోగరూపా యథేష్టదా ||160||

||ఇతి శ్రీగాయత్రీ దివ్యసహస్రనామస్తోత్రం సంపూర్ణం ||

శ్రీ గాయత్రి సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో, శ్రద్ధతో నిత్యం పఠిస్తే మనలో జ్ఞానశక్తి పెరుగుతుంది. మనసులో ఉన్న అయోమయం తగ్గి, ఆలోచనలకు స్పష్టత వస్తుంది. ఇది దీర్ఘమైన స్తోత్రం అయినా, మన జీవన విధానాన్ని మెల్లగా సానుకూలంగా మార్చే సాధన. నమ్మకంతో ఈ స్తోత్రాన్ని చదివితే గాయత్రి దేవి అనుగ్రహం మన జీవితంలో తప్పక అనుభూతి అవుతుంది.
Previous Post Next Post